Robbery case : మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన కేసు తుదిశ్వాస విడిచింది. గడియారం, రూ.4 నగదు, చేతి రుమాలు దొంగతనం చేసిన ఘటనకు సంబంధించి దాదాపు 51 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ పుణె కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.
1974లో పుణెలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం కేసు నమోదైంది. గులాబ్ సాహు జాదవ్, ముకుంద కెర్బా వాగ్మారే, రాజారాం తుకారం కాలే అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గులాబ్, ముకుంద నేరాన్ని అంగీకరించగా, 1975 ఏప్రిల్ 10న కోర్టు వారిద్దరినీ దోషులుగా ప్రకటించింది.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
అయితే, రాజారాం తుకారం కాలే మాత్రం పోలీసులకు (Robbery case) చిక్కకుండా పరారీలోకి వెళ్లాడు. అతడు దాదాపు ఐదు దశాబ్దాల పాటు కనిపించకపోవడంతో కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా బలహీనమయ్యాయి. ఈ నేపథ్యంలో పుణె జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.జే. చవాన్ 2024 డిసెంబర్ 26న రాజారాంను నిర్దోషిగా ప్రకటించారు. అతడిపై ఉన్న అన్ని అరెస్ట్ వారెంట్లను కూడా కోర్టు రద్దు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: