Rohit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిస్తూ, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అజిత్ పవార్ మృతికి సంబంధించిన వ్యవహారంలో న్యాయం జరగాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: AI ImpactSummit: థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

రామ్మోహన్ నాయుడు పదవిలో ఉంటే న్యాయం జరగదు!
ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగితే అజిత్ పవార్ మృతి కేసులో పారదర్శకమైన విచారణ జరగదని, బాధితులకు న్యాయం అందదని ఆయన ఆరోపించారు.
అగ్రనేతలకు విజ్ఞప్తి
ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వెంటనే స్పందించాలని రోహిత్ పవార్ కోరారు. అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: