హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు
దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) అడ్డుకట్ట వేయాలని కేంద్ర నిర్ణయించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్ నిబంధనలకు అనుగుణంగా తగిన సాంకేతికతను ఉపయోగించి రోడ్లను నిర్మిస్తే చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు కేంద్రానికి సూచించారు. ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిపై గతంలో వరుసగా ప్రమాదాలు జరిగేవి. ఒక్కొక్కసారి పది నుంచి ఇరవై మంది మృతి చెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కీలక మలుపుల వద్ద సరైన హెచ్చరికలు లేకపోవడం, ఒకేసారి రోడ్డు మలుపు తిప్పడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. ఈ లోపాలు సరిదిద్దిన తరువాత చాలా వరకు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.
Read Also: Toll plaza revenue: రికార్డు స్థాయిలో టోల్ ప్లాజాల ఆదాయం
రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా డ్రైవర్ పనిగంటలు, రోడ్డు నిర్మాణ స్థితిగతులు, ట్రాఫిక్, తెల్లవారుజామున, మధ్యాహ్నం వంటి సమయాలపై ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటన్నిటినీ విశేషిస్తూ ఎక్కువ భాగం ప్రమాదాలకు రోడ్డు నిర్మాణ లోపాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. రోడ్లు గుంతలమయంగా ఉండటంతో వేగంగా వస్తున్న వాహనం డ్రైవర్ దానిని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న వాహనానాన్ని ఢీకొనడంగానీ, ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడటం, డివైడర్ను ఢీకొనడం వంటివి చోటుచేసుకుంటాయి.
కొన్ని సందర్భాల్లో హైవేలలో డివైడర్ దాటి అటువైపుగా వస్తున్న వాహనంపై పడి భారీ ప్రాణనష్టానికి దారి తీస్తుంది. ఉదాహరణకు తెలంగాణలోని చేవెళ్లలో కంకరలారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడం ఒక కారణమని తేలింది. ప్రస్తుతం చాలా రోడ్లు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ (బివోటీ) విధానంలో నిర్మిస్తున్నారు. ముందుగా కాంట్రాక్టర్ కొంత పెట్టుబడి పెట్టి రోడ్డు నిర్మించి, ఆ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాల నుంచి టోల్ వసూలు చేసి రోడ్డు నిర్వహణతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా దశలవారీ వసూలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల రోడ్డు కనీసం పది సంవత్సరాల వరకు ఎక్కడ గోతులు ఏర్పడినా వెంటనే కాంట్రాక్టర్ పూడ్చి వేసి రోడ్డు మరింతగా దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.


Read Also: why is gold price rising: పగ్గాలు లేని పసిడి ధరలు
ఇకపై ప్రమాదాలకు కాంట్రాక్టర్ల ప్రమేయాన్ని కల్పిస్తూ కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే వీటిని ఉత్తర్వుల రూపంలో పొందుపరిచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జాతీయ రహదారిలోని నిర్దిష్ట ప్రాంతంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత కాంట్రాక్టర్లకు భారీ జరిమానా విధించాలని రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో నిర్మించే రహదారులకు దీన్ని వర్తింపజేయనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. బీవోటీ విధానంలో నిర్మించే హైవేలపై ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని, వారే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉమాశంకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి బీఓటీ పత్రాన్ని సవరించామన్నారు. నిర్దిష్ట ప్రాంతం.. 500 మీటర్ల పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టరుకు 25 లక్షల జరిమానా విధిస్తామని, అదే ప్రాంతంలో మరుసటి ఏడాది ప్రమాదం జరిగితే ఇది 50 లక్షలకు పెరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర హైవే మంత్రిత్వశాఖ పరిధిలో ఇటువంటి ప్రమాద ముప్పు ఉన్న 3,500 ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ నిర్ణయంతో హైవే ప్రమాదాలకు కట్టడి వేసేందుకు దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: