हिन्दी | Epaper

India: బియ్యం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్

Sudheer
India: బియ్యం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్

భారత్‌ వ్యవసాయ రంగంలో మరో గర్వించదగ్గ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి( Rice Production)లో చైనాను వెనక్కి నెట్టి భారత్ (India) నంబర్ వన్‌గా నిలిచింది. 2024 నాటికి భారత్‌ 14.9 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసి తొలి స్థానంలో నిలవగా, చైనా 14.46 కోట్ల టన్నులతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇది భారత రైతుల కృషికి, ప్రభుత్వం చేపట్టిన సాగు ప్రోత్సాహక కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

గోధుమల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానం

ఇదే సమయంలో గోధుమల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితులు, సాగు విధానాల్లో మార్పులు దేశ వ్యాప్తంగా పంటల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, బియ్యం మరియు గోధుమల ఉత్పత్తిలో భారత్ నిలకడగా ముందుకు సాగుతోంది. రైస్ ఎగుమతుల ద్వారా కూడా విదేశీ మారకద్రవ్య ఆదాయం పెరుగుతున్నది.

సాగు చేసే భూములలో మార్పులు, నీటి లభ్యత

అయితే, నూనె గింజల ఉత్పత్తి విషయంలో మాత్రం భారత్ వెనుకబడుతోంది. సాగు చేసే భూములలో మార్పులు, నీటి లభ్యత కొరత, తగిన మద్దతు ధరల లభ్యత లేకపోవడం వల్ల నూనె గింజల సాగు తగ్గుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని పరిశీలకులు సూచిస్తున్నారు. మొత్తం మీద, బియ్యం ఉత్పత్తిలో భారత్ సాధించిన ఈ విజయంతో దేశ వ్యవసాయ రంగానికి గర్వకారణంగా మారింది.

Read Also : AP Cabinet Meeting: నేడు క్యాబినెట్ భేటీలో కీలక చర్చలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870