ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీ సర్వే (Resurvey)ప్రారంభించి ఐదేళ్లకు పైగా అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ఫలి తాలు ప్రజలకుఅందుబాటులోకి రాకపోవడం ఒక ముఖ్య సమస్యగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం సాగి ఉంటే,భూముల యజమానులు ఆన్లైన్లో సులభంగా తమ రికార్డులు పొందగలిగేవారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే, చాలామంది రైతులు ఇంకా ప్రతిసారి పంట రుణం రీన్యువల్ చేయాలంటే లేదా భూమి లావా దేవీలు జరపాలంటే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాలలో రీ సర్వే పూర్త య్యాక అధికారులు రైతులకు రసీదులు ఇచ్చి, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దిష్ట సమయంలో రాతపూర్వకంగా తెలియచేయాలి. చాలా గ్రామాల్లో రైతులు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు. అంటే రికా ర్డులు పూర్తిస్థాయిలో ఖరారయ్యాయి. అయితే ఈ రికార్డులు ఆన్లైన్లో కనిపిం చకపోవడం వల్ల ప్రజలకు ఉపయోగం తక్కువగానే మిగిలింది. ప్రస్తుత పరిస్థితిలో ఒక రైతుపంట రుణం రీన్యువల్ చేసుకోవాలంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్లి రాతపూర్వకంగా వన్ బి పొందాలి. ఇది ఒక విధంగా ప్రభుత్వ డిజిటలైజేషన్ ఉద్దేశ్యానికి విరుద్ధం. ముందుగా ప్రజలు మీ సేవ లేదా మీభూమి ద్వారా సులభంగా రికార్డులు పొందగలిగారు. ఇప్పుడు రీసర్వే పూర్తయ్యాక కొత్త రికార్డులు సరిగా అప్డేట్ (Update) కానందువల్ల ఆ సౌలభ్యం లేకుండాపోయింది. భూమి యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ముఖ్యమైనది సమయం, డబ్బు వృథాకావడం. ప్రతి సారి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లడం రైతులపై అదనపు భారమవుతోంది. ఇది గ్రామీణ ప్రజానీకానికి పెద్ద సమస్యగా మారింది. పంట పనులు చూసుకోవడమో,ఇతర కూలి పనుల కోసం వెళ్ళడమో చేయాల్సిన రైతులు ఇలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అనవసరమైన ఇబ్బంది. రీసర్వే అనేది చాలా ముఖ్యమైన సంస్కరణ. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూముల వివాదాలు, అశుద్ధ రికార్డులు, పక్కా హద్దులు లేని సమస్యలు తొలగించడానికి ఇది గొప్ప ప్రయత్నం. ప్రజలకు ఖచ్చితమైన హక్కుపత్రాలు ఇవ్వడం, భూమి వివాదాలను తగ్గించడం ఈ కార్యక్రమంప్రధాన లక్ష్యం. కానీ పూర్తి చేసిన రికార్డులను తక్షణమే ఆన్లైన్లో ఉంచకపోతే ఈ ప్రయోజనం రైతులకు చేరదు. ప్రజల అంచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకసారి రీ సర్వే (Resurvey)పూర్తయ్యాక ఎలాంటి అభ్యంతరాలు లేవంటే, ఆ రికార్డులు వెంటనే అందుబాటులో ఉండాలి. రైతులు తాము యజమా నులమని నిరూపించుకోవడానికి మళ్లీ మళ్లీ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉండకూడదు. ఇది మాత్రమే కాకుండా, కొత్తగా భూములు అమ్ముకోవాలనుకున్నా లేదా పంట రుణాలు తీసుకోవాలనుకున్నా సులభతరం కావాలి.

ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తి చేసి, రికార్డులు అందుబాటులో ఉంచితే రైతులపై నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం చేసిన రీ సర్వే(Resurvey) పేరు మీద కొత్త సమస్యలు మాత్రమే వచ్చాయని ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆలస్యాలు తగ్గించి పూర్తి అయిన గ్రామాల రికార్డు లను వెంటనే ఆన్లైన్లో ఉంచడం అత్యవసరం. ఈసమస్య పరిష్కారం కోసం అధికారులు కొన్ని చిన్న చర్యలు తీసు కుంటే పెద్ద మార్పు వస్తుంది. గ్రామాల వారీగా రీ సర్వే పూర్తి అయిన వెంటనే ఆ గ్రామానికి సంబంధించిన వన్ బి, అడంగళ్, ఎల్పీ నంబర్లు, పటాలు అన్నీ మీ సేవ లేదా మీభూమి లాంటి వెబ్సైట్లలో అప్డేట్ చేయాలి. అలాగే బ్యాంకులకు కూడా ఈ డిజిటల్ రికార్డులు చెల్లుబాటు అయ్యేలా మార్పులు చేయాలి. ప్రభుత్వం ఈ సమస్యను ఒక అవకాశంగా తీసుకుంటే రైతులకు మాత్రమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగానికి కూడా ఊరటనిస్తుంది. డిజి టల్ రికార్డులు అందుబాటులోకి రావడంవలన భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయి, భూమి విలువ పెరుగుతుంది. పంట రుణాలు తేలికగా లభిస్తాయి. ఇవన్నీ కలిపి గ్రామీణాభివృద్ధి కి దోహదం చేస్తాయి. గ్రామీణ ప్రజానీకం కూడా ఈ అం శంలో చైతన్యం కలిగి ఉండాలి. రీ సర్వే పూర్తయినా రికా ర్డులు ఆన్లైన్లో కనిపించకపోతే అధికారులు దగ్గర ప్రశ్నిం చాలి, ఫిర్యాదులు చేయాలి. పత్రికలలో, సమావేశాలలో, సంఘాల ద్వారా ఈ సమస్యను ప్రస్తావించాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలు. ఒక వైపు పారదర్శకతను చూపించాలి. మరోవైపు రైతుల నమ్మకాన్ని పొందాలి. ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి అత్యవసరంగా అవసరమై నది పూర్తి చేసిన రికార్డులను వెంటనేప్రజలకు అందుబాటు లో ఉంచడం. రీ సర్వే విజయవంతమయ్యిందని చెప్పుకో వాలంటే ఇది తప్పనిసరిగా జరగాలి.
-తరిగోపుల నారాయణస్వామి
మూడు రకాల సర్వేలు ఏమిటి?
అన్వేషణాత్మక, వివరణాత్మక మరియు సాధారణం. ప్రతి రకమైన పరిశోధన దాని స్వంత ప్రయోజనాలను అందిస్తుంది మరియు కొన్ని మార్గాల్లో ఉపయోగించబడుతుంది. మీ ఆన్‌లైన్ సర్వేలలో ఒకేసారి అన్ని రకాల పరిశోధనలను ఉపయోగించడం వలన ఎక్కువ అంతర్దృష్టులు మరియు మెరుగైన నాణ్యమైన డేటాను సృష్టించడంలో సహాయపడుతుంది.
మొదటి సర్వే ఎవరు చేశారు?
1400 BC నాటికి ఈజిప్షియన్లు మనం సర్వేయింగ్ పద్ధతులను పిలిచే పద్ధతులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలకు తెలుసు. ఇక్కడ, వారు భూమిని విభజించారు, తద్వారా వాటిపై పన్ను విధించవచ్చు. దూరాలను కొలవడానికి వారు ముడులు ఉన్న తాళ్లను ఉపయోగించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: