हिन्दी | Epaper

Restaurant : వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

Tejaswini Y
Restaurant : వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

Restaurant : దేశంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) ధరల పెరుగుదల మరియు కొరత ప్రభావం సామాన్యుడి కంచంపై పడుతోంది. హోటల్ యజమానులు గ్యాస్ ధరల భారాన్ని కస్టమర్లపైకి నెట్టేస్తూ వినూత్నంగా ‘గ్యాస్ ఛార్జీలు’ వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read also: Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!

Restaurant: బిల్లులో గ్యాస్ ఛార్జ్

సాధారణంగా హోటల్ బిల్లులో ఆహార పదార్థాల ధరలతో పాటు జీఎస్టీ (GST) ఉండటం సహజం. కానీ, తాజాగా చెన్నైలోని ఒక రెస్టారెంట్‌లో ఇడ్లీ, వడ తిన్న కస్టమర్‌కు వచ్చిన బిల్లు చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ హోటల్ యాజమాన్యం టిఫిన్ ధరలకు అదనంగా ‘గ్యాస్ ఛార్జ్’ (Gas Charge) పేరుతో రూ. 10 వసూలు చేసింది.

ఇదే తరహా ఘటన బెంగళూరులోనూ వెలుగుచూసింది. అక్కడ ఒక హోటల్ ఏకంగా రూ. 30 అదనపు భారాన్ని గ్యాస్ కొరత సాకుతో కస్టమర్లపై వేసింది. ఈ వింత బిల్లులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నెటిజన్ల ఆగ్రహం

ఈ బిల్లులను చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. “ఇకపై హోటల్‌కు వెళ్తే తిన్న పదార్థాలకే కాకుండా, వండిన గ్యాస్‌కు కూడా విడిగా బిల్లు కట్టాలా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. జీఎస్టీ భారం చాలదన్నట్లు, ఇప్పుడు ఈ కొత్త గ్యాస్ బిల్లులు కూడా తోడవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870