ఢిల్లీ సీఎం రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా (Rekha Gupta)ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ సీఎం(Rekha Gupta) భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సీఎం భద్రతను పెంచింది.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో Z-కేటగిరీ (Z category) భద్రతను కల్పించింది. దీంతో ఇవాళ ఉదయం సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలూ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతోపాటూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌తోపాటూ ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు.

బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా(42)గా గుర్తించారు. అతడు జంతు ప్రేమికుడిగా తెలుస్తున్నది.
రేఖా గుప్తా ఢిల్లీ సీఎం నేపథ్యం ఏమిటి?
గుప్తా 19 జూలై 1974న హర్యానాలోని జులానాలో జన్మించారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దౌలత్ రామ్ కళాశాల నుండి పట్టభద్రురాలైంది మరియు 2022లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘజియాబాద్‌లోని IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా నుండి LLB పూర్తి చేసింది.
ఢిల్లీ ఫస్ట్ సీఎం ఎవరు?
చౌదరి బ్రహ్మ ప్రకాష్ (16 జూన్ 1918 – 11 ఆగస్టు 1993) ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయవేత్త, అతను ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రిగా మరియు స్వాతంత్ర్య సమరయోధుడుగా పనిచేశాడు, 1940లో మహాత్మా గాంధీ ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
కేజ్రీవాల్ ఎన్నిసార్లు ఢిల్లీ సీఎం అయ్యారు?
అరవింద్ కేజ్రీవాల్ జననం 16 ఆగస్టు 1968) ఒక భారతీయ రాజకీయవేత్త, కార్యకర్త మరియు మాజీ అధికారి, అతను ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను 2013 నుండి 2014 వరకు మరియు 2015 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: