हिन्दी | Epaper

బడ్జెట్ పై ప్రముఖుల స్పందనలు

Vanipushpa
బడ్జెట్ పై ప్రముఖుల స్పందనలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్. ఈ బడ్జెట్ ఆర్థిక సర్వేకు అనుగుణంగా ఉంది. మధ్య తరగతికి ఉపశమనం కల్పించడంతో పాటు కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకూ 7 లక్షల వరకూ వార్షిక ఆదాయం కలిగిన వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండగా.. దాన్ని ఇప్పుడు ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. దీంతో పాటు టీడీఎస్, టీసీఎస్ లోనూ పలు మార్పులు చేశారు.

వివిధ నాయకుల స్పందనలు

రైలు కాస్త పట్టాలు తప్పింది: కాంగ్రెస్ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి బడ్జెట్ పై వివిధ నాయకుల నుంచి స్పందనలు వస్తున్నాయి. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాల నాయకులు బడ్జెట్ ను ప్రశంసిస్తూ ప్రజా సంక్షేమం అని పిలుస్తుండగా.. ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బడ్జెట్ ను విమర్శిస్తూ.. కేవలం నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొన్నారని అన్నారు. ఇంకా బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. దీంతో ఆ బడ్జెట్ రైలు కాస్త పట్టాలు తప్పిందని విమర్శించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన బడ్జెట్: బీఎస్పీ దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలు ఉండడంతో పాటు రోడ్లు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్ లో ప్రజల జీవితం చాలా ఇబ్బందుల్లో ఉందని.. దీనిని కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ కాంగ్రెస్ మాదిరిగానే రాజకీయ ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి సారించిందని విమర్శించారు.

కుంభమేళాలో మరణాల గణాంకాలు ముఖ్యమైనవి, బడ్జెట్ కాదు: ఎస్పీ బడ్జెట్ కాదు.. మహాకుంభమేళాలో మరణించిన వ్యక్తుల గణాంకాలు చాలా ముఖ్యమైనవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలు చనిపోతే వారి గణాంకాలను కూడా అందించలేనప్పుడు మనం ఈ గణాంకాలను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. ఇది భారత బడ్జెటో?.. బీహార్ బడ్జెటో?.. అని అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు.

ఇది పేద వ్యతిరేక బడ్జెట్: ఆర్జేడీ ఈ బడ్జెట్ గత బడ్జెట్ కాపీ అని ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. ఇది గ్రామీణ, పేద వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు. బీహార్ కు ఏమీ లభించలేదని, కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బీహార్ కు ఏమీ ఇవ్వాలని కోరుకోవడం లేదన్నారు. బడ్జెట్ సాకుతో, తేజస్వి మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని లేవనెత్తారు. బీహార్ ప్రత్యేక ప్యాకేజీకి డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన అడిగారు.చంద్రబాబు నాయుడు రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీతో వెళ్లిపోయారని.. నితీష్ కుమార్ బీహార్‌కు ఏమీ తీసుకురాలేకపోయారని..నితీష్ అపస్మారక స్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870