RBI bond auction : దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.48 శాతం వడ్డీ కలిగిన 2035 కాలపరిమితి ప్రభుత్వ బాండ్‌ను రీ–ఇష్యూ రూపంలో ఈ విక్రయం జరగనుంది.
ఈ ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మల్టిపుల్ ప్రైస్ విధానంలో ఈ వేలం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరమైతే అదనంగా రూ.2,000 కోట్ల వరకు సమీకరించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
వేలంలో పాల్గొనేవారు ఆర్బీఐ ఈ-కుబేర్ (RBI bond auction) ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేయాలి. నాన్-కాంపిటీటివ్ బిడ్లు ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు, కాంపిటీటివ్ బిడ్లు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు స్వీకరిస్తారు. చిన్న పెట్టుబడిదారులు, అర్హులైన వ్యక్తుల కోసం మొత్తం నోటిఫైడ్ మొత్తంలో 5 శాతం కోటాను నాన్-కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు కేటాయించారు.
ప్రభుత్వాలు సాధారణంగా బడ్జెట్ లోటును భర్తీ చేయడం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు అవసరమైన ఖర్చుల కోసం ఇలాంటి బాండ్ల విక్రయానికి వెళ్తుంటాయి. వేలం ఫలితాలను జనవరి 2న ప్రకటించనుండగా, విజేతలు జనవరి 5న చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండటంతో ఈ బాండ్లు తక్కువ రిస్క్ కలిగిన సురక్షిత పెట్టుబడులుగా భావించబడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: