రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ.10, రూ.500 నోట్లను విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి కొత్తగా మహాత్మా గాంధీ సిరీస్‌తో త్వరలో రూ.10 అలాగే రూ.500 నోట్లను విడుదల చేయనున్నట్లు RBI ప్రకటిన కూడా చేసింది. అయితే ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. గతంలో ఆర్‌బిఐ కొత్త 100, 200 రూపాయల నోట్లను విడుదల చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి.
ఆర్‌బిఐ ఏం చెప్పిందంటే
ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ.10, రూ. 500 నోట్లలాగానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తాజా అప్‌డేట్‌లో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన అన్ని రూ.10, రూ. 500 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. కానీ కొత్త నోట్లపై ఆర్‌బిఐ గవర్నర్ మల్హోత్రా సంతకం ఉంటుంది.

కొత్త నోట్లు ఎప్పుడు జారీ చేస్తారు
కొన్ని సందర్భాల్లో ఆర్‌బిఐ కొత్త నోట్లను జారీ చేస్తుంది. ఉదాహరణకు, మార్కెట్లో ఉన్న కరెన్సీ నోట్లు చాలా పాతవి అయినప్పుడు లేదా నోట్ల డిజైన్ మారినప్పుడు లేదా కొన్ని నోట్లు చెలామణి నుండి తీసేసినప్పుడు. కొత్త రూ.10, రూ.500 నోట్లను ప్రవేశపెట్టడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న పాత నోట్లపై ఎటువంటి ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 100, 200 నోట్లు కూడానా: గత నెలలో ఆర్‌బిఐ కొత్త రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త వెలువడిన వెంటనే, పాత నోట్లకు ఏమవుతాయో అనే చర్చలు ప్రారంభమయ్యాయి ? అప్పుడు కేంద్ర బ్యాంకు ఈ నోట్ల డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పింది. ఈ మార్పులో ఆర్‌బిఐ గవర్నర్ సంతకం గురించి మాత్రమే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి మీకు తెల్సిందే. అందువల్ల ఆయన సంతకం ఉన్న కొత్త రూ.100, రూ.200 నోట్లు జారీ చేయబడతాయి. ఇలా కొత్త గవర్నర్ నియామకం తర్వాత ఆయన సంతకంతో నోట్స్ జారీ చేసే సాధారణ ప్రక్రియ. అలాగే ఇప్పటికే ఉన్న నోట్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.
2016లో డీమానిటైజేషన్
నవంబర్ 2016లో నోట్ల రద్దు జరిగింది. దీని కింద 500, 1000 రూపాయల నోట్లను చెలామణి నుండి తొలగించారు. తరువాత ప్రభుత్వం కొత్తగా 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే, మే 2023లో RBI రూ.2000 నోటును కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. 2000 రూపాయల నోటును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు 3.5 లక్షల కోట్లకు పైగానే.
READ ALSO: Trump: ‘ఆపిల్’కి అమెరికా సుంకాల సెగ..పెరగనున్న ఐఫోన్ ధరలు