हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi:రాహుల్ గాంధీ వియత్నం పర్యటనపై విమర్శలు గుప్పించిన రవిశంకర్ ప్రసాద్

Anusha
Rahul Gandhi:రాహుల్ గాంధీ వియత్నం పర్యటనపై విమర్శలు గుప్పించిన రవిశంకర్ ప్రసాద్

కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఎక్కువ సమయం గడపకుండా, తరచుగా విదేశీ పర్యటనలు చేస్తూ, వియత్నాంలో ఎక్కువగా గడుపుతున్నారని బీజేపీ నేత ఆరోపించారు.రాహుల్ గాంధీ వియత్నాంలో సెలవుల్లో ఉన్నారని, ఈ సమయంలో ఆయన దాదాపు 22 రోజులు అక్కడే గడిపారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి వియత్నాం పట్ల అసాధారణమైన అనుబంధం ఉందన్నారు.

రవిశంకర్ ప్రసాద్ విమర్శలు

ఈ నేపథ్యంలో, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీకి వియత్నాం పట్ల అసాధారణమైన అనుబంధం ఉన్నట్లు కనిపిస్తోంది.నూతన సంవత్సరం సందర్భంగా కూడా రాహుల్ గాంధీ వియత్నాంలోనే ఉన్నారని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో ఎందుకు ఎక్కువ సమయం గడపడం లేదని ఆయన ప్రశ్నించారు. వియత్నాం పట్ల రాహుల్ గాంధీకి ఎందుకంతా అసాధారణమైన ప్రేమ ఉందో చెప్పాలన్నారు. వియత్నాంను పదే పదే సందర్శించినందుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడని, ఆయన భారతదేశంలో ఉంటూ రాజకీయాలు చేయాలని, విదేశాలకు వెళ్లడంలో బిజీగా ఉండకూడదని బీజేపీ నాయకుడు అన్నారు. రాహుల్ గాంధీకి వియత్నాం అంటే ఎందుకు అంత ప్రేమ అని ప్రసాద్ అడిగారు. కాగా, కాంగ్రెస్ దీనికి స్పందిస్తూ, బీజేపీ ఈ విషయాన్నిరాజకీయం చేస్తోందని ఆరోపించింది. రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, ప్రయాణాలపై విమర్శలు చేయడం సరైన విధానం కాదని”ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే బీజేపీ ఆయనను కావాలనే విమర్శిస్తోంది” అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ravi shankar prasad and rahul gandhi 1603943896

గత ఏడాది డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తర్వాత, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనను బీజేపీ తప్పుబట్టింది. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోతుంటే, రాహుల్ గాంధీ వియత్నాంలో సెలవులు గడిపారని బీజేపీ పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870