
రాజస్థాన్‌లోని(Rajastan) ఉదయ్‌పూర్ నగరంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో ఘటన తీవ్రత మరింత స్పష్టమైంది. గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Read Also: Chhattisgarh: బీజాపూర్‌లో ఐఈడీ పేలుడు.. యువకుడి మృతి

సిగరెట్ తాగుతూ, వీడియోలు చూస్తూ కారు నడిపిన నిర్లక్ష్యం..
ఈ ప్రమాదంలో అయాన్ (17), ఖురేషీ (14), మహ్మద్ (19), ఖవాజా (17) అనే నలుగురు యువకులు మృతి చెందారు. వీరిలో కొందరు మైనర్లు కావడం మరింత విషాదాన్ని కలిగిస్తోంది. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రమాద(Rajastan) సమయంలో కారులో ఉన్న యువకులు సిగరెట్ తాగుతూ, మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో ఉదయ్‌పూర్ నగరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకపోతే ప్రాణాలకే ముప్పు తప్పదని ఈ ప్రమాదం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా యువత అతివేగం, మొబైల్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: