Indian Constitution: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ ప్రాంగణంలో ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ చూపించిన ఆలోచనలు, సిద్ధాంతాలు ఇప్పటికీ భారత దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని ఆయన అన్నారు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై సుప్రీం దృష్టి– అత్యవసర పిల్ దాఖలు
ప్రతి ఒక్కరి బాధ్యత రాజ్యాంగ రక్షణ
“అంబేద్కర్ ఒక మహోన్నత నాయకుడు. ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈ దేశానికి బలం. ఆయనను స్మరించుకోవడం మాత్రమే కాదు, ఆయన సిద్ధాంతాలు, రాజ్యాంగాన్ని కాపాడటం ప్రతి భారత పౌరుడి కర్తవ్యంగా భావించాలి,” అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం నిరంతరం ప్రమాదంలో ఉందని, దానిని రక్షించడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తరువాత ఎక్స్ (X) లో చేసిన పోస్ట్‌లో కూడా ఇదే సందేశాన్ని పునరుద్ఘాటిస్తూ, “బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నా వినమ్ర శ్రద్ధాంజలి. సమానత్వం, న్యాయం, మానవ గౌరవం వంటి ఆయన శాశ్వత విలువలు, రాజ్యాంగ పరిరక్షణలో నా నిశ్చయాన్ని మరింత దృఢపరుస్తున్నాయి. మరింత సమానత్వం, కరుణతో కూడిన భారతదేశం కోసం ఆయనే ప్రేరణ” అని రాశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: