Rahul gandhi : సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఒక ప్రత్యేక మాల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లోహపు అలంకరణలతో కూడిన ఈ హారం నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినదిగా గుర్తించారు.
ఈశాన్య భారతదేశంలోని నాగా కమ్యూనిటీలలో ఇలాంటి మాలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, వారి గౌరవం, గుర్తింపు మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావిస్తారు.
నాగాలాండ్ గిరిజన సంప్రదాయాల్లో ఆభరణాలకు చాలా లోతైన అర్థం ఉంటుంది. వారు ధరించే నెక్లెస్‌లు, తలపాగాలు ఆ వ్యక్తి ఏ తెగకు చెందినవారు, సమాజంలో వారి స్థానం ఏమిటి అనే విషయాలను తెలియజేస్తాయి.
రాహుల్ గాంధీ ధరించిన ఈ మాల నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో నివసించే కోన్యాక్ నాగా తెగకు చెందినదిగా తెలుస్తోంది. చరిత్రలో ఈ తెగను తలలను వేటాడే యోధులుగా కూడా పేర్కొనేవారు.
Read Also: Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ
నాగా సంప్రదాయ ఆభరణాల్లో కేవలం పూసలు (Rahul gandhi) మాత్రమే కాకుండా లోహపు పతకాలు, గాజు లేదా రాతి పూసలు, గవ్వలు, ఎముకలు మరియు కట్టెల వంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఉపయోగిస్తారు. ఒక్కో తెగకు ప్రత్యేకమైన డిజైన్ ఉండటం వల్ల వారి ఆభరణాలను బట్టి వారు ఏ కమ్యూనిటీకి చెందినవారో గుర్తించవచ్చు.
ఒకప్పుడు ఈ ఆభరణాలు సామాజిక ప్రతిష్టకు, సంపన్నతకు గుర్తుగా ఉండేవి. ప్రస్తుతం పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ వేడుకల సమయంలో ఈ సంప్రదాయ మాలలను ధరించే ఆచారం కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ ఈ హారం ధరించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: