हिन्दी | Epaper

Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు

Vanipushpa
Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు

భారత్‌ పాక్‌లను ఉద్దేశిస్తూ ఉగ్ర బాధితులను, నేరస్థులను ఒకేలా చూడకూడదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌(Indian Foreign Minister Jaishankar) వ్యాఖ్యానించారు. భారత్‌(India)కు తన ప్రజలను ఉగ్రవాదం నుంచి కాపాడుకునే హక్కు ఉందని క్వాడ్ దేశాల కూటమి అర్థం చేసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు జైశంకర్‌ తెలిపారు. వాషింగ్టన్‌(Washington)లో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి జై శంకర్‌ హాజరయ్యారు.

ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవసరం: జైశంకర్

ప్రపంచ సవాళ్లను అధిగమించడంలో క్వాడ్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడంపై అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులతో విస్తృత చర్చలు జరిపారు. భారత్‌లో నవంబర్‌లో జరిగే క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ఎజెండాపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జైశంకర్, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని క్వాడ్‌ దేశాలకు సూచించారు. భారత్ తీసుకున్న ఆపరేషన్‌ సిందూర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తుందని ఆశించారు. సముద్ర డొమైన్, లాజిస్టిక్స్, విద్య, రాజకీయ సమన్వయం వంటి అంశాల్లో క్వాడ్ గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు
Pahalgam: పహల్గాం నేరస్థులకు శిక్ష పడాల్సిందే..క్వాడ్‌ నేతలు

పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తోందా?
“ఇటీవలి అనుభవాల దృష్ట్యా ఉగ్రవాదం గురించి ఒక మాట చెబుతున్నా. ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టోలరెన్స్‌ను ప్రదర్శించాలి. బాధితులు, నేరస్థులను ఎప్పుడూ సమానంగా చూడవద్దు. ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగిస్తాము. మా క్వాడ్ భాగస్వాములు దానిని అర్థం చేసుకుని అభినందిస్తారని మేము ఆశిస్తున్నాము” అని జైశంకర్ తెలిపారు. అయితే ఉగ్రదాడికి పాల్పడిన నేరస్థులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి త్వరగా శిక్ష పడాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు క్వాడ్ నేతలు. జైశంకర్ వ్యాఖ్యలు పరోక్షంగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోందన్న అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. “బాధితులను, నేరస్థులను ఒకేలా చూడరాదు” అనే వ్యాఖ్యల ద్వారా భారత్ పాక్‌ను ఉద్దేశించి గట్టిగా హెచ్చరించింది. క్వాడ్ భాగస్వామ్యంలో సముద్ర భద్రత, విద్య, లాజిస్టిక్స్ మరియు రాజకీయ సమన్వయ అంశాల్లో గణనీయమైన పురోగతి నమోదైందని జైశంకర్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నిర్ణయాన్ని కూడా క్వాడ్ గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివే – జైశంకర్ స్పందన
మరోవైపు, వాణిజ్య అవకాశాలను చూపించి భారత్‌-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేలా వారిపై ఒత్తిడి తీసుకువచ్చానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఉత్తుత్తివేనని జైశంకర్‌ కొట్టిపారేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ చర్చలు జరిపినప్పుడు తాను ఆ గదిలోనే ఉన్నానని సోమవారం న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “భారత్-పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ చేసేందుకు తన వాణిజ్య ఒత్తిడి ఉపయోగించానని” చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటు స్పందన చేశారు.

Read Also: Top Billionaires : న్యూయార్క్ లో టాప్ బిలియనీర్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870