हिन्दी | Epaper

Punjab: పెళ్లికి నిరాకరించిందని ఇంటికి నిప్పంటించిన వ్యాపారి

Anusha
Punjab: పెళ్లికి నిరాకరించిందని ఇంటికి నిప్పంటించిన వ్యాపారి

పంజాబ్‌లో మరోమారు మానవత్వాన్ని కించపరిచే ఘటన చోటుచేసుకుంది.పెళ్లికి,తిరస్కరించిందని ఒక మహిళ ఇంటికి నిప్పంటించి దారుణానికి పాల్పడిన ఓ సైకోగాడు, చుట్టుపక్కల వారిని షాక్‌కు గురి చేశాడు. ఈ ఘటనలో మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ సంఘటన జలంధర్ జిల్లా రామమండి ఫేజ్-2లోని ఏక్తా నగర్ ప్రాంతం (Ekta Nagar area) లో శనివారం (ఆగస్టు 3) ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు సుఖ్వీందర్ కౌర్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ సమయంలో ఒక కూరగాయల వ్యాపారి వివాహం చేసుకోవాలని ఆమెపై బలవంతం చేస్తున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. కానీ సుఖ్వీందర్ (Sukhwinder) ఈ వివాహాన్ని నిరాకరించింది. దీంతో ఆ వ్యక్తి ప్రతీకార చర్యగా ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

Punjab
Punjab

ఘటన వివరాలు

నిందితుడు సుఖ్వీందర్ కౌర్ ఇంటికి తరచూ కూరగాయలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అతడు ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదనను తీసుకువచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు మహిళ అతనిని చెంపదెబ్బ కొట్టింది. ఈ చర్యతో ఆమెపై పగ పెంచుకున్న వ్యాపారి పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి, మహిళ ఇంటి గోడపైకి ఎక్కి ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న సుఖ్వీందర్ కౌర్, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు రామ మండి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తెలిపారు.

పంజాబ్‌లో ప్రసిద్ధి చెందిన ఆహారం ఏమిటి?

పంజాబ్‌లో సర్సోం దా సాగ్, మక్కీ దా రోటీ, లస్సీ, బట్టర్ చికెన్, చోలే భటూరే వంటి వంటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

పంజాబ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఏవి?

పంజాబ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు: గోల్డెన్ టెంపుల్ (అమృత్‌సర్), జలియన్‌వాలా బాగ్, వాఘా బోర్డర్, ఆనంద్‌పూర్ సాహిబ్, రోపర్, పటియాలా కోటలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/miryalaguda-marijuana-batch-in-miryalaguda-fear-among-locals/telangana/525147/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ హెచ్చరిక

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
0:21

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

దొంగతనం నెపం.. అవమాన భారంతో ఆత్మ హత్య

దొంగతనం నెపం.. అవమాన భారంతో ఆత్మ హత్య

కారు అదుపుతప్పి దంపతుల దుర్మరణం!

కారు అదుపుతప్పి దంపతుల దుర్మరణం!

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్

రీఫండ్ కోసం ప్రయత్నించి రూ. 98 వేలు పోగొట్టుకున్న మహిళ!

రీఫండ్ కోసం ప్రయత్నించి రూ. 98 వేలు పోగొట్టుకున్న మహిళ!

హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత
0:17

హైదరాబాద్‌లో 800 కిలోల కుళ్ళిన చికెన్ పట్టివేత

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
2:22

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

మీకు తెలుసా ? గూగుల్ లో ఇలా సెర్చ్‌ చేస్తే ఇక జైలుకే

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

శంషాబాద్‌లో 74 డ్రోన్లు సీజ్.. సింగపూర్ నుంచి తెచ్చిన ముగ్గురు అరెస్ట్!

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు
0:19

రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

యూట్యూబర్ వైష్ణవి.. గర్భిణి అని చూడకుండా చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870