हिन्दी | Epaper

Narendra Modi: ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతితో ప్రధాని మోడీ సమావేశం

Sudha
Narendra Modi: ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రపతితో ప్రధాని మోడీ సమావేశం

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున కచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ కీలక పరిణామం అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు.

Narendra Modi: ఆపరేషన్ సిందూర్ పై రాష్ట్రపతితో  ప్రధాని మోడీ సమావేశం
Narendra Modi: ఆపరేషన్ సిందూర్ పై రాష్ట్రపతితో ప్రధాని మోడీ సమావేశం

పక్కా సమాచారంతోనే దాడులు
ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ధ్వంసం చేసిన వాటిలో ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయని తెలిసింది. భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, వాటిని నిర్దేశించడం వంటి కార్యకలాపాలు ఈ కేంద్రాల నుంచే జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే సైన్యం ఈ దాడులు చేపట్టింది.
రెండు వారాల క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక నేపాల్ దేశస్థుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన అనతికాలంలోనే భారత సాయుధ దళాలు ఈ ప్రతిదాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.

Read Also : Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870