రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) చరిత్ర సృష్టించారు. జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్ జలాంతర్గామి INS వాఘ్‌షీర్‌లో బయలుదేరారు. రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి ఉన్నారు. కాగా కల్వరి క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి ప్రయాణించడం ఇదే తొలిసారి.
Read Also: Ayodhya: బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి

అధికారులతో ఆమెముచ్చటించారు
ఈ పర్యటనలో భాగంగా భారత నౌకాదళ సామర్థ్యాలను, జలాంతర్గాముల పనితీరును (Draupadi Murmu) ఆమె స్వయంగా పరిశీలించారు. సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకాదళ సిబ్బంది, అధికారులతో ఆమె ముచ్చటించి, వారి ధైర్యసాహసాలను అభినందించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారత నౌకాదళ వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటన భారత రక్షణ రంగంపై ,మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: