ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) (పీకే) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి తాత్కాలికంగా విరామం ((TVK) Party temporarily on hiatus) ప్రకటించారు. ప్రస్తుతం తన సొంతరాష్ట్రమైన బీహార్‌లో జరుగుతున్న రాజకీయ చర్చలపై ఆయన పూర్తిగా దృష్టి సారించారు.ప్రశాంత్ కిశోర్ ఇటీవల బీహార్‌లో ‘జన్ స్వరాజ్’ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా జన్ స్వరాజ్ పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని పల్లెల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు.

టీవీకే సభలో పీకే హామీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో టీవీకే రెండవ వార్షికోత్సవ సభలో పాల్గొన్న పీకే, విజయ్ రాజకీయ ప్రయాణానికి పూర్తి మద్దతు ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారు.ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పీకే షెడ్యూల్ బిజీగా మారింది. టీవీకే వ్యూహరచన నుంచి తాత్కాలికంగా తప్పుకున్నప్పటికీ, నవంబర్ నాటికి తిరిగి టీమ్‌లో చేరతారని సమాచారం. తాను మాట తప్పే వ్యక్తి కాదని, ఒకసారి బీహార్ కార్యక్రమాలు ముగిశాక విజయ్ పార్టీకి సలహాదారుగా తిరిగిరావడం ఖాయమని ఆయన సన్నిహితులు అంటున్నారు.
రాజకీయ రంగంలో రెండు వేరుశాఖలు
ప్రస్తుతం పీకే రెండు రాష్ట్రాల్లో రెండు భిన్న రాజకీయ శక్తుల్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు తమిళనాడు రాజకీయాల్లో టీవీకేకు మద్దతు, మరోవైపు బీహార్‌లో స్వంత పార్టీకి పోటీ. రాజకీయ వ్యూహాలలో పీకే మాస్టర్ మైండ్‌గా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ రెండు ప్రయాణాలు ఏం ఫలితాలు ఇస్తాయో చూడాలి.
Read Also : betting apps : హైదరాబాద్ లో ఏపీ టెక్కీ ఆత్మహత్య