Indian politics news : న్యూఢిల్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన 88 నిమిషాల భేటీ పార్లమెంట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మొదటగా ఈ సమావేశం కేవలం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకానికే అని భావించినప్పటికీ, చర్చ చాలా విస్తృతంగా సాగినట్టు బయటపడింది.
నిబంధనల ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ వంటి కీలక పదవుల నియామకాల్లో ప్రధాని, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేతలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ప్రధాని తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకోగా, సమావేశం 1.07 గంటలకు ప్రారంభమైంది. కానీ సమావేశం ఊహించిన దానికంటే ఎక్కువసేపు కొనసాగడంతో, పార్లమెంట్‌లో ఇతర అంశాలపై కూడా చర్చ జరిగిందేమోనని చర్చలు మొదలయ్యాయి.
Read also: Election Inducement: ఎన్నికల నియమాలు ఉల్లంఘన: డబ్బుల పంపిణీపై అభ్యర్థుల దృష్టి
88 నిమిషాల అనంతరం రాహుల్ గాంధీ బయటకు రాగా, (Indian politics news) కేవలం ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాత్రమే కాకుండా, మొత్తం ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకం, అలాగే ఒక విజిలెన్స్ కమిషనర్ అంశాలపై కూడా చర్చ జరిగినట్టు స్పష్టమైంది.
సమావేశంలో ప్రతిపాదిత అన్ని నియామకాలపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, వాటిని రాతపూర్వకంగా కూడా సమర్పించారని వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సమావేశాల్లో ప్రతిపక్ష నేతల నుంచి అభ్యంతరాలు రావడం సాధారణమేనని, గతంలో మల్లికార్జున ఖర్గే గానీ, రాహుల్ గాంధీ గానీ హాజరైన సందర్భాల్లోనూ ఇదే విధానం కొనసాగిందని వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా 8 పదవులు ఖాళీగా ఉన్నాయి. దేశంలో ఆర్‌టీఐ దరఖాస్తులపై వచ్చిన ఫిర్యాదులు, అప్పీల్స్‌ను పరిష్కరించేది ఈ కమిషన్‌నే. సెప్టెంబర్ 13న హీరాలాల్ సామరియా పదవీ విరమణ అనంతరం ఈ కీలక స్థానాలు భర్తీ కాలేదు.
సీఐసీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం కమిషన్ వద్ద సుమారు 30,800కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచారహక్కు చట్టం సెక్షన్ 12(3) ప్రకారం, ఈ నియామకాల కోసం ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న ఎంపిక కమిటీ సిఫారసులు చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: