దేశంలోని కోట్లాది మంది రైతులకు ముఖ్యమైన పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి పథకంలో మరో ముందడుగు పడింది. శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 20వ విడత నిధులను విడుదల చేశారు. ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు నేరుగా జమ అయ్యాయి.

రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకే పథకం
వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తున్నారు. తాజా విడతతో రైతులు ఖరీఫ్ పంటల (Kharif crops) సీజన్‌కి అవసరమైన పెట్టుబడి ఖర్చులను సమకూర్చుకోగలుగుతారు.
ఇప్పటి వరకూ అందిన సాయం వివరాలు
ఈ పథకం క్రింద గత 19 విడతల్లో సుమారు రూ.3.46 లక్షల కోట్ల ఆర్థిక సాయం రైతులకు అందించింది. 19వ విడతను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. అప్పట్లో 9.8 కోట్ల మంది రైతులకు రూ.22,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: