हिन्दी | Epaper

Plane crash: ఈ సంఘటన దిగ్భ్రాంతిని క‌లిగించింది : రామ్మోహ‌న్ నాయుడు

Sharanya
Plane crash: ఈ సంఘటన దిగ్భ్రాంతిని క‌లిగించింది : రామ్మోహ‌న్ నాయుడు

అహ్మ‌దాబాద్‌లో (Ahmedabad) ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే మేఘ‌నీన‌గ‌ర్ ఘోడాస‌ర్ క్యాంపు ప్రాంతంలోని జనావాసాలపై కుప్పకూలింది. విమానం ప్రయాణంలో ఉన్నంతసేపూ అంతా సవ్యంగా ఉన్నప్పటికీ టేకాఫ్ అనంతరం హఠాత్తుగా ఎటీసీతో సంబంధం తెగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించగా, జనావాసాలపై కూలిన విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు

విమాన ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ తక్కువ కాలంలోనే టేకాఫ్ చేసిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్​కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు.

మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు స్పందించారు. అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం దిగ్భ్రాంతిని క‌లిగించింద‌న్నారు. ప్ర‌మాదంపై వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. స‌హాయ‌క బృందాలు ఇప్ప‌టికే ఘ‌ట‌నాస్థ‌లిలో ఉన్నాయి. 90 మంది చొప్పున మూడు బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు పేర్కొన్నారు. హుటాహుటిన అహ్మ‌దాబాద్ త‌ర‌లివెళ్తున‌ట్లు రామ్మోహ‌న్ నాయ‌కుడు పేర్కొన్నారు.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రాణనష్ట వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Read also: Air India: అహ్మదాబాద్​లో కుప్ప కూలిన ఎయిరిండియా విమానం..కొనసాగుతున్న సహాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870