మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (Plane Crash) విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు.
Read Also: AP News: బస్‌లో తల బయట పెట్టిన ఇంటర్ విద్యార్థి.. చివరికి ఏమైందంటే?

విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా ఈ ప్రమాదంపై (Plane Crash) స్పందిస్తూ, సరైన వెలుతురు లేకపోవడం వల్లే పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అడిగారని అన్నారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మొదటిసారి ఆయన ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడని, రెండో ప్రయత్నంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం కూలిపోయిందని తెలిపారు. అయితే, ఈ ప్రమాదంపై మరిన్ని ఆధారాలు లభించే వరకు వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజిన్‌లో సమస్య లేదని అభిప్రాయపడ్డారు. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా విమానం ల్యాండ్ అవడానికి మరో ఇంజిన్‌తో సురక్షితంగా పైలట్ ల్యాండ్ చేయగలడని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: