PIL on Saurav Das’ Nationality : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జాతీయత, నేపథ్యంపై విచారణ జరపాలని, ఒకవేళ అతను భారతీయుడు కాదని తేలితే అతని పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును రద్దు చేయాలని, అలాగే అతని సోషల్ మీడియా ఖాతాలను నిరోధించాలని కోరుతూ శుక్రవారం మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కాంచీపురానికి చెందిన వ్యాపారవేత్త ఆర్. గణేష్ కుమార్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ పిఐఎల్‌పై కేంద్రానికి నోటీసు జారీ చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :