ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులుగా ఉన్న ప్రతి ఉద్యోగికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. దీనిని EDLI పథకం అంటారు. ఉద్యోగి అకాల మరణం చెందితే, అతడి నామినీకి లేదా కుటుంబానికి గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా సొమ్ము అందుతుంది.EDLI అంటే (Employees’ Deposit Linked Insurance Scheme). ఇది EPFO నిర్వహించే ఒక జీవిత బీమా పథకం (Life insurance plan). ఇందులో ఉద్యోగి మరణించినప్పుడు అతడి కుటుంబానికి డైరెక్ట్ లాంప్‌సమ్ చెల్లించబడుతుంది. దీనికోసం ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి బీమా ప్రీమియం . మొత్తంగా ఇది యజమాని సహకారంతోనే అమలవుతుంది.

ఎవరు అర్హులు?
EPF కింద రిజిస్టర్ అయిన ఏ ఉద్యోగినైనా EDLIకి అర్హత ఉంటుంది. ఎలాంటి అదనపు ఫారం నింపాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఈ పథకంలో కవర్ అవుతారు. ఉద్యోగి లైఫ్‌కవర్ కోసం ప్రత్యేకంగా నమోదు కావాల్సిన పనిలేదు.ప్రస్తుతం గరిష్ట ప్రయోజనం ₹7 లక్షలు. ఇది ఉద్యోగి గత 12 నెలల సగటు జీతానికి 30 రెట్లు ప్లస్ బోనస్ ఆధారంగా లెక్కిస్తారు. కనీస బీమా కవరేజ్ ₹2.5 లక్షలుగా ఉంటుంది. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే విశ్వసనీయ పథకం.
క్లెయిమ్ ఎలా చెయ్యాలి? అవసరమైన పత్రాలు ఏవి?
ఉద్యోగి మరణించినప్పుడు నామినీ లేదా వారసుడు ఈ పథకం కింద క్లెయిమ్ వేయొచ్చు. అవసరమైన పత్రాలు:
ఫారం 5 IF (EDLI క్లెయిమ్ కోసం).
ఫారం 20 (EPF ఉపసంహరణకు).
ఫారం 10C లేదా 10D (పెన్షన్‌కు).
మరణ ధృవీకరణ పత్రం.
వారసత్వ రుజువు (అవసరమైతే).
ఈ పత్రాలను యజమాని ధృవీకరించి ప్రాంతీయ EPFO కార్యాలయానికి సమర్పించాలి.EDLI పథకం అనేది ఒక్క ఉద్యోగికి కాదు, అతడి కుటుంబానికి కూడా భద్రతను అందించేందుకు ఉపయోగపడుతుంది. అకాల మరణం జరిగినప్పుడు ఈ బీమా ఓ ఆశాకిరణంగా నిలుస్తుంది. EPF సభ్యులు అయితే, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తప్పక తెలుసుకోవాలి.
Read Also : Perni Nani : పేర్ని నానిపై కేసు నమోదు