భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే ఈ అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఇంధనంగా ఉండబోతోంది. అందుకే పర్యావరణ మార్పుల నేపథ్యంలో మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, సౌర (Solar), పవన (Wind) ఇంధనాల వైపు మళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also: Gold rate record: రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్’
ఎనర్జీ స్టోరేజ్: అసలు సవాలు ఇదే! భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. కానీ, ఇక్కడ ఒక చిక్కు ఉంది. సూర్యుడు ప్రకాశించినప్పుడే సోలార్ విద్యుత్ వస్తుంది, గాలి వీచినప్పుడే పవన విద్యుత్ వస్తుంది. కానీ, మనకు 24 గంటల పాటు నిరంతరాయంగా పవర్ కావాలి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్’ (BESS) అత్యవసరం. నిల్వ సదుపాయం లేకపోతే మనం ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ వృధా అవుతుంది. అందుకే ఈ బడ్జెట్(Budget 2026) లో బ్యాటరీ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు, అలాగే పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.
మేక్ ఇన్ ఇండియా
క్రిటికల్ మినరల్స్ , చైనాపై ఆధారపడటం క్లీన్ ఎనర్జీ రంగంలో మరో ప్రధాన సమస్య ‘క్రిటికల్ మినరల్స్’. బ్యాటరీల తయారీకి కావాల్సిన లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల కోసం ప్రస్తుతం మనం చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. గ్లోబల్ సప్లై చైన్‌లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, భారత్ స్వయంసమృద్ధి సాధించాలంటే దేశీయంగా ఖనిజాల వెలికితీత (Mining) , రీసైక్లింగ్ ను ప్రోత్సహించాలి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ సీఈఓ అనురాగ్ చౌదరి వంటి నిపుణులు చెబుతున్న ప్రకారం.. దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి బడ్జెట్ లో ఈ ఖనిజాల అన్వేషణకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతం ప్రస్తుతం మనం సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ సెల్స్ , పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలక విడిభాగాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇది విదేశీ మారక ద్రవ్యంపై భారం చూపుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: