వైసీపీ కీలక నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి బుగ్గ మఠం భూముల (Bugga Matham Land)పై సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ (Petition)పై సోమవారం జస్టిస్ కేవీ. విశ్వనాధన్ (KV Vishwanathan), జస్టిస్ ఎన్‌కే. సింగ్ (Justice NK Singh) ధర్మాసనం విచారణ చేసింది. దీనికి సంబంధించి హైకోర్టునే ఆశ్రయించాలని పెద్దిరెడ్డికి న్యాయస్థానం సూచించింది. అంతవరకూ బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు యథాతధా స్థితి కొనసాగించాలని పేర్కొంది.

సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే కోరిన ప్రయత్నం విఫలం
సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు, బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం ఏపీ హైకోర్టు చట్ట ప్రకారం, మెరిట్స్ ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. బుగ్గ మఠం భూములపై ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం – జస్టిస్ కేవీ. విశ్వనాథన్, జస్టిస్ ఎన్‌కే. సింగ్ – హైకోర్టుకే పరిమితంగా పరిష్కారం కోరాలని సూచించింది.
ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నో
బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్‌పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని, కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని, హైకోర్టు మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సోమవారం నుంచి రెండు వారాల పాటు.. యథాతధా స్థితిని కొనసాగించాలని.. ఆ తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్చ ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. పెద్దిరెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో తిరస్కారం, రెండు వారాల Status Quo ఆదేశం. పూర్తి విచారణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆధీనంలో, హైకోర్టు చట్టపరంగా, మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టత.
Read Also: Chevireddy Mohith Reddy: మద్యం కేసులో.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ