हिन्दी | Epaper

Parliament Monsoon Sessions: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Sharanya
Parliament Monsoon Sessions: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

దేశం మొత్తం వేచి చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions) జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా, ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) సోషల్ మీడియాలో వెల్లడించారు.

సమావేశాల పొడిగింపు

ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవు. ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు(Extended for a week) . ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్​ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.

విపక్షాల డిమాండ్లు – భద్రతా, రాష్ట్రీయ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి

ఈ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Sessions) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్​పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.

గత సమావేశాల గుర్తు – వక్ఫ్ బిల్లు, విశ్వవిద్యాలయ చట్టం

ఇక గత బడ్జెట్ అయితే 2025లో జనవరి 31వ తేదీ- ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడే ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమెదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో బిల్లుగా మారింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమావేశాల్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 కూడా ఆమెదం పొందింది.

Read also: Delhi: ఢిల్లీ లో జంట హత్యల కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870