हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Pak : పాక్ విషయంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Sudheer
Pak : పాక్ విషయంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో రూబియో, భారత్‌కు సంయమనం పాటించాలని సూచించారు. పరిణామాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఆశయమని తెలిపారు.

ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు

జైశంకర్ ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. భారత్ ఇప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. దేశ భద్రతకోసం తగిన చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పాక్‌ నుంచి రెచ్చగొట్టే చర్యలు వస్తున్నా, భారత్ స్పందన బాధ్యతాయుతంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు లభించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

భారత దాడులను ఆపితే మీము ఆపుతాం

ఇకపోతే రూబియో అంతకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు. భారత దాడులను భారత్ ఆపితే, తామూ దాడులు ఆపుతామని పాక్ తరఫున వెల్లడించారు. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి మినహాయింపు లేకుండా దాడులు కొనసాగించాలన్న నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎలా పరిణమిస్తాయో అనే అంశంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also : Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870