జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) భారత్ ధీటుగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. భారత దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రశంసించారు.‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడులతో దాయాదికి భారీగా నష్టం వాటిల్లింది.

అదానీ గ్రూప్ 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతమ్ అదానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దళాలు ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దళాలు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. కీర్తి కోసం కాదు, పతకాల కోసం కాదు.. దేశం కోసం పోరాడారు. భారతదేశానికి శాంతి విలువ తెలుసు (India Knows Value Of Peace). అదే సమయంలో మనమై దాడి చేస్తే ఎలా స్పందించాలో కూడా తెలుసు’ అని గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు.
డిఫెన్స్ డ్రోన్లు
ఇక అదానీ డిఫెన్స్ డ్రోన్లు ఆపరేషన్ సిందూర్‌లో భాగమైనట్లు చెప్పారు. “ఈ ఆపరేషన్‌లో మా సంస్థ Adani Defence తయారు చేసిన SkyStriker Kamikaze డ్రోన్‌లు ఉపయోగించబడ్డాయి,”డ్రోన్‌లు ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషించాయి. “దేశ రక్షణలో భాగంగా మా సాంకేతికత పని చేయడం గర్వంగా ఉంది,” అని అదానీ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కూడా అదానీ స్పందించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.