हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Opposition parties: సంకుచిత పోకడలు ప్రమాదకరం

Sudha
Opposition parties: సంకుచిత పోకడలు ప్రమాదకరం

ప్రాచీన కాలంలో ప్రపంచంలో బహుగా ప్రకాశించిన పర్షియా దేశం తదుపరి మతం ఆధార దేశంగా ఇరాన్ పేరుతో మారిపోయి, నేడు అతి దీన దేశంగా, అన్నిరంగాల్లో విఫలమై విలవిలలాడుతున్న అతిపేద దేశంగా ప్రస్తుతం మన కళ్లముందు కదలాడుతుంది. దీనికి ప్రధాన కారణం మతపరమైన కట్టుబాట్లు ఆచారాలు, పరిపాలన అభివృద్ధికి ఆటంకంగా ముఖ్యంగా మహిళలు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అవుతున్న తరుణంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలతో అట్టుడుకుతూ, ఇతర దేశాల ఆధిపత్యం వహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆధునిక కాలంలో ప్రపంచం మొత్తం శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్న తరుణంలో సహజవనరుల చమురు నిల్వలు ఉన్న ఇరాన్ దేశం సుభిక్షంగా ఉండవల సింది పోయి, తీవ్రమైన సంక్షోభంలో పడటానికి ప్రధాన కారణం మత ఆధారిత పరిపాలన అనే గ్రహించాలి. ప్రపంచ వ్యాప్తంగా రాజరికం, మత ప్రభువులు పాలన, నియంతల పాలన పోయి, దాదాపు ప్రపంచంలోని మూడోవంతు దేశా ల్లో ప్రజాస్వామ్యకుద్దతిలో పరిపాలన సాగుతున్న దేశాలు ఏవిధంగా అభివృద్ధి పంథాలో సాగుతున్నాయో గుర్తెర గాలి. మత ఆధారంగా మన నుంచి విడిపోయిన మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా దాదాపు అన్ని రంగాల్లో దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. అంతేకాకుండా అసాంఘిక శక్తులకు ఆస్థానంగా మారింది. పాలన మత ఆధారంగా మారిపోతే, అభివృద్ధి ఆగిపోయి, ఈ ఆధునిక కాలంలో అధోగతి పాలు అవుతుంది అని చరిత్ర చెబు తోంది. ఏ దేశంలోనైనా అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మత ఆధారంగా ఉన్న దేశాల పాలనలో మహిళలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం అంతేకాకుండా అణచి వేయడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయా దేశాల్లో అశాంతి, ఆగ్రహావేశాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కులు మంటగలసి అభివృద్ధిలో కుంటుపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) నేతలను ఉపేక్షిచడం మంచిది కాదు. గత సంవత్సరం వరకు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నేడు పరిపాలనలో మత ఆధారిత ప్రభావం పెరగడంతో దేశం అతలాకుతలం అవుతోంది. పరిస్థితి చేజారకముందే చర్యలు తీసుకోవడం ఉత్తమం అని గ్రహించాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మత ఆధారిత పరిపాలన వల్ల అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. నేటి ఆధునిక కాలంలో ఏ దేశంలోనైనా మత, కుల, లింగ, ప్రాంతీయ, భాష, రంగు, ఆధిపత్యం వంటి విషయాలు ఆధారంగా పరిపాలన సాగితే, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని అన్ని దేశాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు.

Read Also : http://Tamil Nadu: TVK పార్టీకి ‘విజిల్‌’.. కమల్ హాసన్ పార్టీకి ‘టార్చిలైట్’ గుర్తు

Opposition parties
Opposition parties

ఇక ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ‘ఒకే’ అనే భావన ప్రోత్సహించడం జరుగుతుంది. భారతదేశం విశిష్ట లక్షణం’భిన్నత్వంలో ఏకత్వం’ ఈ విషయం మరచి పోయి నేటి పాలకులు ఒకే భాష, ఒకే మతం, ఒకే పార్టీ వంటి అంశాలు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది ఏమాత్రం శ్రేయోష్కరం కాదు. సరికదా భవిష్యత్తులో వివక్షత, విద్వేష, విభజన వంటి సంకుచిత ధోరణులు పెరిగి, దేశంలో అలజడులు ప్రబలే అవకాశం ఉంది అని గ్రహించాలి. తాత్కాలిక అధి కారం కోసం, ఆధిపత్యం కోసం పరితపించే పాలకులు, భవిష్యత్తులో పెను ప్రమాదాలు అంచనా వేయాలి. భారత రాజ్యాంగం ఆశయాలు దృష్టిలో ఉంచుకోవాలి. నాకు అధి కారం ఉందికదా అని ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విర్రవీగుతూ సామ్రాజ్యవాద ధోరణితో వివిధ దేశాలనుభయ పెడుతూ ఆక్రమణకు సిద్ధం అవుతున్న తరుణంలో, తన మిత్రులు అనుకున్న యూరోపియన్ దేశాలు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు గ్రీన్లాండ్ విషయంలో ఎదురు తిరుగుతున్నాయి. అనగా అతిగా ప్రవర్తిస్తే ఏ విషయంలో నైనా ఎదురుదెబ్బ తగులుతుంది అని గ్రహించాలి. క్రీ.శ ఒకటవ శతాబ్దం నుంచి నేటి వరకూ ప్రపంచం వ్యాప్తంగా అనేక ఆర్థిక సామాజిక రాజకీయ మార్పులు వచ్చాయి. అందరూ సమానమే అనే భావన పురుడు పోసుకుంది. మాగ్నా కార్టా, మానవ హక్కులు, సహజ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవత్వం, సామ్యవాదం లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి అనేక అంశాలపై నేటి ప్రభుత్వాలు పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇవి అన్ని దేశాలు గుర్తించాలి. మన దేశ పాలకులు కూడా ముఖ్యంగా రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పారదర్శకంగా పరి పాలన అందించాలి. అధికారం అందిపుచ్చు కోవడానికి అడ్డ దారులు తొక్కరాదు. ఆయా రాష్ట్రాల్లో సున్నితమైన అంశా లను రెచ్చగొట్టి, ఓట్లు దండుకోవడం మంచిది కాదు. ఆయా రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్న లోపాలను ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) ఎత్తి చూపి, ప్రజ లను చైతన్యవంతం చేసి మరింత మెరుగైన పరిపాలన అందిస్తాం అనే భరోసా కల్పించాలి. ఓట్లు రాబట్టుకోవడం మంచిది. అంతేకాకుండా కుల, మత, భాష ఆధారంగా ఓట్లు దండుకోవడం మంచిది కాదు. ఏది ఏమైనా ప్రస్తుత ప్రపం చంలో అధికారం, ఆధిపత్యం ధోరణులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐక్యమత్యంతో సంఘటితంగా ఉండాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే వారిని బలపరచాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా పరిపాలన అందించడంలోనే భవిష్యత్తు ప్రపంచం సుఖశాం తులతో వర్ధిల్లుతుంది అని అందరూ ముఖ్యంగా పాలకులు గ్రహించాలి. మీడియా కూడా కీలక పాత్ర పోషించాలి.
-ఐ.ప్రసాదరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870