పాకిస్థాన్ (Pakistan) లో, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అప్పుడే ముగిసిపోలేదని కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని, ఇంకా కొనసాగుతోందని కేంద్ర మంత్రి (Union Minister) కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు.

అసత్య ప్రచారం నమ్మవద్దు
అయితే భద్రతా కారణాల రీత్య ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను బయటపెట్టలేమని అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌పై అసత్య ప్రచారం చేస్తోందని రిజిజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ప్రతీకార దాడులను పాకిస్తాన్ తక్కువచేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అధికారిక వర్గాల నుంచే తెలుసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోందని, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కిరణ్ రిజిజు చెప్పారు. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో మొత్తం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also : Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి