ఉగ్రవాదంపై అణచివేతకు డిప్లొమాటిక్ మార్గాల్లో పాక్‌కు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, భారత్ మాటలను ఆ దేశం లెక్కచేయలేదు. చివరికి ‘దండోపాయం’ అనే తుది మార్గాన్ని భారత్ ఎంచుకుంది. భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాక్ లోపల మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఉన్న ఉగ్ర స్థావరాలపై గగనతల దాడులకు దిగింది. ఈ మెరుపు దాడుల వల్ల ఉగ్రవాద స్థావరాలు కూలిపోయాయి, పాక్ పరిపాలకులకు భయాందోళనలు కలిగించాయి.
మొత్తం 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు
ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. పాక్ భూభాగంలోని మురిడ్కే, బహవల్పూర్, సియాల్కోట్, చకంబ్రూ ప్రాంతాలు లక్ష్యంగా మారగా, POKలోని ముజఫరాబాద్‌లోని రెండు ప్రాంతాలు, కోట్లీ, గుల్పూర్, భీంబర్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ యొక్క ప్రధాన కేంద్రంగా ఉన్న మురిడ్కే పై కూడా గగనతల దాడులు జరిగినట్లు సమాచారం. ఇది భారత్‌కు ఎదురైన ఒక ముఖ్యమైన విజయం.
ఉగ్ర సంస్థలకు చెందిన టాప్ లీడర్ల స్థావరాలే లక్ష్యం
ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు చెందిన టాప్ లీడర్ల స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్ దాడులు జరగడం గమనార్హం. టెర్రరిస్టుల్లో టెరర్ పుట్టించే బాధ్యతను భారత్ తన భుజాలపై వేసుకుని, నేరుగా చర్యలకు దిగింది. పాక్‌కు ఇది ఒక గట్టి హెచ్చరికగా మారింది – ఇకపై ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే, భారత భద్రతా బలగాలు ఏ స్థాయికైనా వెళ్లగలవన్న సందేశాన్ని ప్రపంచానికి తెలిపింది.
Read Also : Operation Sindoor : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు