हिन्दी | Epaper
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Odisha: విజిలెన్స్‌ అధికారులకు దొరికిన అవినీతి తిమింగ‌లం

Sharanya
Odisha: విజిలెన్స్‌ అధికారులకు దొరికిన అవినీతి తిమింగ‌లం

ఒడిశా (Odisha) రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో భారీ అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా సేవలందిస్తున్న బైకుంత నాథ్ సారంగి (Baikuntha Nath Sarangi) అనే అధికారి 2 కోట్ల‌కు పైగా రూపాయల అక్రమ నగదుతో పట్టుబడటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం సంచలనం రేపింది.

ఏకకాలంలో ఏడు ప్రదేశాల్లో దాడులు

ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం దాదాపు రూ.2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. విజిలెన్స్ అధికారులు (Vigilance officers) వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి బయటకు విసిరి నగదు కట్టలను పారవేసేందుకు ప్రయత్నించాడు. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని ఆ నోట్ల‌ కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్‌లోని అత‌ని నివాసంలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్‌లో మరో కోటి రూపాయలు దొరికాయి. ఇంకా ఇతర ప్రదేశాల్లో పట్టుబడ్డ నగదు, ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతోంది.

అక్రమ ఆస్తులపై ఆరోపణల నేపథ్యంలో దాడులు

సారంగిపై గత కొన్ని రోజులుగా తన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఒక ఇంజనీర్‌గా తనకు ఉండే వేతనంతో పోలిస్తే కలిగి ఉన్న ఆస్తుల విలువ అనుమానాస్పదంగా ఉందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. గదుతోపాటు పలు పత్రాలు, బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుసకున్నట్లు తెలిసింది. ఈ విచారణలో 26 మంది అధికారులు, అందులో నిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పోలీసు అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాలు నిర్వహించారు.

Read also: Indians: 1,100 మంది భారతీయులను బహిష్క‌రించిన అమెరికా..మంత్రిత్వ శాఖ వెల్లడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870