NMC: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లు, పీజీ మెడికల్ విద్యార్థులకు సకాలంలో స్టైఫండ్ చెల్లించని 7 మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 1 కోటి చొప్పున భారీ జరిమానా విధించింది. విద్యార్థుల కష్టార్జితాన్ని చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది.

సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన
గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ప్రతి మెడికల్ కాలేజీ తమ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో పారదర్శకంగా పొందుపరచాలి. అయితే, ఈ 7 కాలేజీలు ఆ వివరాలను వెల్లడించకపోవడమే కాకుండా, విద్యార్థులకు అందాల్సిన భత్యాన్ని ఆపేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఎంసీ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.భవిష్యత్తులోనూ స్టైఫండ్ చెల్లించకపోయినా, వివరాలు వెల్లడించకపోయినా కొత్త అడ్మిషన్లు నిలిపివేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తామని ఎన్ఎంసీ హెచ్చరించింది. జరిమానా పడిన కాలేజీలలో ఏపీలోని ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: