కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటివారిని ‘రాహ్ వీర్'(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి రూ.25వేలు రివార్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)ప్రకటించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు రూ.1.5L ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: