కేంద్ర ప్రభుత్వ అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమావేశాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Read also: LIC: LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !!

తొలిసారి
ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు, సీఎం, మంత్రులను తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 26 ఏళ్ల తర్వాత తొలిసారి. నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ (10 సార్లు), చిదంబరం (9 సార్లు) తర్వాత అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: