NH-167 4-lane road: పాలమూరు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి చిత్తశుద్ధి చాటుకున్నది. నారాయణపేట జిల్లాలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్నగర్ నాలుగు లేన్ల రహదారికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మంజూరు కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
Read Also: Andhra Pradesh: బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో గూడెబెల్లూర్ నుండి మహబూబ్ నగర్ జాతీయ రహదారి-167ను 4-లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కానుంది.

NH-167 4-lane road: రూ. 3,175 కోట్ల నిధులు మంజూరు
ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,175 కోట్ల నిధులను మంజూరు చేసింది. నిధుల కేటాయింపుతో పాటు పనుల వేగంపై కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ ప్రాజెక్టును రెండు ఏళ్ల లోపు (రెండేళ్లలో) పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రధానికి ఎంపీ డీకే అరుణ ధన్యవాదాలు
జాతీయ రహదారి విస్తరణకు ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరుపున ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: