ఎల్ఐసీ ‘జీవన్ ఉత్సవ్’ పథకం ప్రధానంగా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ (Whole Life Insurance) కేటగిరీకి చెందుతుంది. ఈ పాలసీలో చేరిన వారికి జీవితాంతం బీమా రక్షణ ఉండటమే కాకుండా, నిర్ణీత కాలం తర్వాత ప్రతి ఏటా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ జనవరి 12 నుండి అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, కేవలం నెల వయస్సు ఉన్న పసిబిడ్డల నుండి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు, అంటే మీ ఆదాయ స్థాయిని బట్టి ఎంత మొత్తానికైనా బీమా తీసుకోవచ్చు.
Telangana Assembly : అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఈ పాలసీలో ప్రీమియం చెల్లింపు గడువు (Premium Paying Term) ముగిసిన తర్వాత, అంటే 7 నుండి 17 ఏళ్ల కాలపరిమితి తర్వాత, పాలసీదారునికి ప్రాథమిక బీమా మొత్తంలో 10 శాతం ప్రతి సంవత్సరం ఆదాయంగా లభిస్తుంది. ఉదాహరణకు, మీరు రూ. 10 లక్షల పాలసీ తీసుకుంటే, ఏటా రూ. 1 లక్ష రూపాయలు జీవితాంతం అందుతాయి. ఒకవేళ పాలసీదారుడు ఈ వార్షిక ఆదాయాన్ని వెంటనే తీసుకోకుండా ఎల్ఐసీ వద్దే ఉంచాలని నిర్ణయించుకుంటే, ఆ మొత్తంపై సంస్థ 5.5% చక్రవడ్డీ (Compound Interest) చెల్లిస్తుంది. ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవడానికి దోహదపడుతుంది.

ఈ పాలసీలో మరో ప్రధాన ఆకర్షణ ‘గ్యారెంటీడ్ ఎడిషన్స్’. పాలసీ ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో, ప్రతి వెయ్యి రూపాయల హామీ మొత్తానికి ఏటా రూ. 40 చొప్పున అదనంగా జమ అవుతుంది. అంటే మీ బీమా రక్షణ కాలంతో పాటు పెరుగుతూ పోతుంది. పాలసీదారుడు మరణించిన పక్షంలో, నామినీకి డెత్ బెనిఫిట్ కింద బీమా మొత్తం మరియు జమ అయిన బోనస్‌లు అందుతాయి. పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించి, జీవితాంతం ఆర్థిక భరోసా పొందాలనుకునే వారికి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com