నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) 129వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
Read Also: AP: లిక్కర్ స్కామ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
సీఎం చంద్రబాబు
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సీఎం కొనియాడారు. ఆయనకు 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈనాటికీ నేతాజీ చేసిన పోరాటాన్ని చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకతని తెలిపారు. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) మనకు సదా స్మరణీయుడని తెలిపారు.
మంత్రి లోకేశ్
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతదేశ స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ నేతాజీ స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్
పరాక్రమ్ దివస్ ను పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకులు నేతాజీ సుభాస్ చంద్రబోస్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఘన నివాళులు అర్పించారు. బెదురు బెరుకు లేని నేతాజీ నాయకత్వంలో బ్రిటీష్ సామ్రాజ్యం గడగడలాడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. నేతాజీ ధైర్యం, మాతృభూమి పట్ల ఎనలేని ప్రేమ తరతరాలు భారతీయుల్లో దేశభక్తిని పెంపొందిస్తాయని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: