గతవారంలో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేకత నిరసనలతో అట్టుడికిన నేపాల్ ఎట్టకేలకు శాంతించింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన సుశీలా కర్కీ ఇటీవలనే బాధ్యతలను స్వీకరించారు. రాజధాని కార్మాండూలోని సింగా దర్బార్లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. దీంతో నేపాల్ లో తొలి మహిళా ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కీ ఘనత వహించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ఆమె, ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని చెప్పారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని, ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంటుకు(new parliament) బాధ్యతలను అందిస్తామని పేర్కొన్నారు.

2026 మార్చి 5న ఎన్నికలు
శనివారం తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్కీ సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ పార్లమెంటును రద్దు చేశారు. నూతన ప్రధాని సుశీలా కార్కీ ఆదివారం కొద్దిమంది మంత్రులతో క్యాబినెట్(Cabinet) ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గం కూర్పు విషయమై జెన్-జడ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి కార్యాలయం దగ్ధమైన నేపథ్యంలో సింగ్ దర్బార్ కాంప్లెక్ లో హోంశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనం నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ఉపాధ్యాయురాలి నుంచి ప్రధానివరకు ఎదిగిన కర్కి
1952 జూన్ 7వ తేదీన విరాట్ నగర్లో జన్మించిన సుశీలా కర్కి తొలుత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అనంతరం న్యాయవ్యవస్థలో ప్రవేశించి, మచ్చలేని మహిళగా గుర్తింపు పొందారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా పూర్తిస్థాయి బాధ్యతు స్వీకరించారు. దీంతో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. ఫలితంగా ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
సుశీలా కార్కి ఎవరు?
సుశీలా కార్కి నేపాల్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తొలి మహిళ.
సుశీలా కార్కి ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు?
ఆమె ఇటీవల సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ పదవిని స్వీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: