తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.రాష్ట్రంపై కేంద్రం విస్మరిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.తమిళనాడుకు మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.ప్రధాని మాట్లాడుతూ – “అనవసరంగా ఏడిచే వారు కొందరుంటారు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి.కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఇది సమాధానంగా నిలిచింది.తమిళనాడుకు మేం గతం కంటే మూడు రెట్లు నిధులు ఇచ్చాం. ఇది మేము చేస్తోన్న అభివృద్ధికి నిదర్శనం అని మోదీ స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2014కి ముందు రైల్వేకు రూ.900 కోట్లు కేటాయించేది. ఇప్పుడు అది రూ.6,000 కోట్లకు పెరిగింది అని వివరించారు.రైల్వే అభివృద్ధిలో తమిళనాడు కీలకంగా ఉందని చెప్పారు.

రాష్ట్రంలో 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.అందులో రామేశ్వరం స్టేషన్ కూడా ఉంది, అని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర గొప్పదని గుర్తించారు.తమిళనాడు బలంగా ఉన్నదే దేశ అభివృద్ధికి బలం అని అన్నారు.ప్రధాని వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తించాయి. కేంద్రం తన వంతు కృషి చేస్తోందని ఆయన చెప్పడం స్పష్టం చేసింది. స్టాలిన్ ఆరోపణలు బేస్ లెస్ అని ప్రధాని సూచించారు. “వాస్తవాలు చెప్పకుండా విమర్శించటం ప్రజలకు తెలియాలి” అని అన్నారు.తమిళనాడులో రామేశ్వరం సభ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మాట్లాడిన తీరుపై ప్రత్యుత్తరంగా స్టాలిన్ ఏమి స్పందిస్తారో చూడాలి. కానీ కేంద్రం మాత్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేయలేదని మోదీ చెప్పిన సంగతి స్పష్టమైంది.
READ MORE : అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం