టాలీవుడ్‌లో పాపులర్ కపుల్‌గా నిలిచిన నాగచైతన్య, శోభితా (Naga Chaitanya, Sobhita) ధూళిపాళ్ల తాజాగా తిరుమల (Tirumala) వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీరు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టారు.తిరుమల దర్శనానికి చైతన్య సంప్రదాయ పట్టు పంచెలో కనిపించగా, శోభిత ఎరుపు-బంగారు కలబోతలోని పట్టు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, దేవస్థానం వారు వీరికి స్వామివారి విగ్రహాన్ని బహుకరించారు. ఫోటోలకు పోజులు ఇస్తూ నవ్వుతూ కనిపించిన ఈ జంట, ఎంతో సంతోషంగా ఉన్నట్టు స్పష్టంగా అనిపించింది.

అభిమానుల ప్రేమకు హైలైట్‌గా నిలిచిన దృశ్యం
ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, మీడియా ఉండటంతో కాస్త రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో నాగచైతన్య తన భార్య శోభిత చేతిని జాగ్రత్తగా పట్టుకుని ముందుకు నడిపించారు. ఈ సన్నివేశం అక్కడ ఉన్నవాళ్లందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతుండటంతో, చాలామంది వీరిని ‘పెర్ఫెక్ట్ కపుల్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం డిసెంబర్‌లో అన్నపూర్ణ స్టూడియోలో, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. చైతన్య 2021లో సమంతతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత 2022లో ఆయన, శోభిత మధ్య ప్రేమా బంధం మొదలైందని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరు పబ్లిక్‌గా కనిపించకుండా, ప్రైవసీతో రిలేషన్‌ను కొనసాగించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు
తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ స్పష్టంగా కనిపిస్తూ, అనేక మంది నెటిజన్లు అభిమానంతో కామెంట్లు చేస్తున్నారు. “ఈ జంటను చూస్తే నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తోంది” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ పర్యటన ద్వారా చైతన్య, శోభిత తమ బంధాన్ని మరింత బలంగా చూపించారు. బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా తామిద్దరం కలిసి దేవుడిని దర్శించుకోవడం, ఒకరికొకరు చూపిన ఆప్యాయత నెట్‌లో హైలైట్ అయింది. సెలెబ్రిటీలుగా కాకుండా సాధారణ భార్యాభర్తలలా కనిపించిన ఈ జంట, వారి నిజమైన సంబంధాన్ని చూపించారు.
Read Also :