‘అజేయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి’ (‘Ajay: The Untold Story of a Yogi’) సినిమాపై సెన్సార్ బోర్డు నిరాకరణతో ప్రారంభమైన వివాదం తాజాగా ముంబయి హైకోర్టు (Bombay High Court) దృష్టికి వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో కోర్టు, సినిమా విషయాన్ని స్వయంగా చూడాలని నిర్ణయించింది.ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన సమ్రాట్ సినిమాటిక్స్ తరపున సీనియర్ అడ్వకేట్ రవి కదమ్, నిఖిల్ అరాధే, సత్యానంద్ హాజరయ్యారు.వీరు ప్రస్తావించిన ప్రకారం, సినిమా సర్టిఫికేషన్ నిరాకరణపై పునర్విమర్శ కమిటీ సరైన కారణాలు తెలియజేయలేదని పేర్కొన్నారు.సినిమాటోగ్రాఫ్ యాక్ట్, 1952లోని సెక్షన్ 5-C ప్రకారం అప్పీల్ దాఖలు చేయొచ్చన్నా, హైకోర్టు అభిప్రాయం ప్రకారం ఇది ఆర్టికల్ 226 ప్రకారం జ్యుడీషియల్ జోక్యం చూపడంలో అడ్డంకి కాదు.కోర్టు వ్యాఖ్యానిస్తూ, CBFC చాలా కఠినంగా స్పందించిందని అభిప్రాయపడింది. సినిమా చూసిన తర్వాతే, అభ్యంతరాలకు అసలైన నేపథ్యం తెలుస్తుందని పేర్కొంది.

పూర్తి సినిమా చూసేలా నిర్ణయం
కోర్టు స్పష్టంగా చెప్పింది –సినిమాను సంపూర్ణంగా చూడాలి, భాగాల వారీగా కాదు.ఈ ప్రక్రియను పాటించకపోవడం వల్లనే, CBFC తీర్మానం తప్పుగా తీసుకున్నట్టు అనిపించిందని న్యాయమూర్తులు చెప్పారు.ఇప్పటికే కోర్టు, CBFCకి పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. సినిమాను పూర్తిగా స్క్రీన్ చేసి, నిర్ణయాన్ని ఆగస్టు 6లోగా పిటిషనర్‌కు తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసుపై వచ్చే సోమవారం (ఆగస్టు 25) తుదితీర్పు వెలువడనుంది.
300 మంది కళాకారుల కల – నిర్మాతల భావోద్వేగం
ఈ సినిమాను నిర్మించిన సమ్రాట్ సినిమాటిక్స్ ఒక ప్రకటనలో, ఈ రోజు తీర్పు న్యాయవ్యవస్థపై మమ్మల్ని మళ్లీ నమ్మేలా చేసింది. 300 మందికిపైగా కళాకారుల కల ఈ సినిమా. ఇది ప్రజల ముందుకు రావాల్సిందే, అని పేర్కొన్నారు.సినిమాను పరిశీలించకుండా, సరైన నోటీసులు జారీ చేయకుండానే నిరాకరించిన విధానాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.CBFC ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచింది. తదుపరి నిర్ణయం CBFC సరిగా స్పందించడంపై ఆధారపడి ఉంటుంది.
Read Also :