మధ్యప్రదేశ్‌లోని(MP) నీముచ్ జిల్లా పరిధిలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. మంచానపడ్డ భర్త, ముగ్గురు పిల్లల బాధ్యతలు ఉన్నప్పటికీ, అంగన్వాడీలో పనిచేస్తున్న కుక్ కాంచన్ బాయి చిన్నారుల ప్రాణాల కోసం అసాధారణ త్యాగం చేశారు.
Read Also:Cherlapally crime: తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

అంగన్వాడీ గ్రౌండ్‌లో ఆడుకుంటున్న సుమారు 20 మంది పిల్లలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. పరిస్థితి అర్థమైన క్షణంలోనే కాంచన్ బాయి ఏమాత్రం(MP) ఆలస్యం చేయకుండా పిల్లలపై టార్పాలిన్ షీట్లను కప్పి, తన శరీరాన్ని కవచంలా మార్చి వారిని లోపల గదిలోకి సురక్షితంగా పంపించారు.
ఈ ప్రయత్నంలో వేలాది తేనెటీగలు ఆమెను కుట్టినా వెనకడుగు వేయలేదు. చివరికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిన కాంచన్ బాయి ప్రాణాలు కోల్పోయారు. ఆమె చూపిన ధైర్యం, త్యాగం స్థానికులతో పాటు యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: