జోర్డాన్ లో మోదీ సందడి.. యువరాజుతో కారులో షికారు ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ (Jordan) యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి మోదీ (Modi) కారులో జర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ గా మారాయి. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.
Read Also: H-1B visa: మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

మోదీ సందర్శించిన ఈ మ్యూజియం దేశంలోనే అతిపెద్దది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రిక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోదీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారును నడిపారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు
రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం జర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్ భారత్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. మోదీ పర్యటనతో జోర్డాన్, భారత్ లమధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగుపడనున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: