‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బహిరంగంగా ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారతీయ మహిళా సైనికుల త్యాగాన్ని దేశం మరవదని, ఆ త్యాగానికి భారత సైన్యం ప్రతీకారంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్‌లోని అలీపుర్ దువార్‌లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (City Gas Distribution) ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. బంగాల్ అంతటా వ్యక్తమైన బాధ, ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. మీ ఆగ్రహాన్ని నేను గ్రహించగలిగాను. ఉగ్రవాదులు మా సోదరీమణుల నుదుటి నుంచి సిందూరాన్ని తుడిచివేయడానికి ధైర్యం చేశారు. కానీ మన సైనికులు ఆ సిందూర్ శక్తిని వారికి చాటి చెప్పారు. ఈ బంగాల్ భూమి నుంచి 140 కోట్ల మంది భారతీయుల తరపున ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని ప్రకటిస్తున్నాను. పాక్ సీమాంతర ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ప్రపంచానికి చేసింది ఏమీ లేదు. ఉగ్రవాదం, సామూహిక హత్యలు పాక్ ఆర్మీ రాటుదేలింది. బహిరంగ యుద్ధం జరిగినప్పుడల్లా పాక్ ఓటమిని ఎదుర్కొంటోంది. పాక్ ఉగ్రవాదం, హింసకు నిలయంగా ఉంది. ఉగ్రవాద చర్యలను భారత్ ఎప్పటికీ సహించదు.”

బంగాల్ పాలనపై మోదీ గట్టి విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పశ్చిమ బంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్, మాల్దాలో జరిగిన హింసను టీఎంసీ సర్కార్ క్రూరత్వం, ఉదాసీనతకు చిహ్నంగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు. బంగాల్లో నిర్మమత (దయలేని) ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీఎం మమత పేరును పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘నిర్మమత’ సర్కార్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఎంసీ శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. అలాగే ప్రజల కష్టాలను విస్మరించిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి అందరూ సమష్ఠిగా పనిచేయాలని కోరారు. “ప్రస్తుతం బంగాల్ వరుస సంక్షోభాలతో సతమతమవుతోంది. ముర్షిదాబాద్, మాల్దాలో జరిగిన హింసాత్మక సంఘటనలు టీఎంసీ ప్రభుత్వం ప్రజల బాధల పట్ల చూపే క్రూరత్వానికి, ఉదాహరణ. ఇక్కడి ప్రజలు ఇప్పుడు కోర్టు మీద మాత్రమే ఆధారపడుతున్నారు. అందుకే బంగాల్ మొత్తం ‘మాకు క్రూరమైన ప్రభుత్వం వద్దు!’ అని కోరుకుంటోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపాటు
దేశంలోని ప్రతి పౌరుడు ‘వికసిత్ భారత్’, అభివృద్ధి చెందిన, సంపన్న భారత్‌ను సాధించడం కోసం ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, గూండాలు స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించిందని మండిపడ్డారు. అలాగే తృణమూల్ స్వార్థపూరిత రాజకీయాలు పేద ప్రజలకు వారి హక్కులను దూరం చేస్తున్నాయని విమర్శించారు. బలహీన వర్గాల పట్ల మమత సర్కార్ నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు.
Read also: Owaisi: సౌదీలో పాకిస్థాన్ ను తీవ్రంగా విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ