ఇంతకుముందు పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ దాడికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థనే బాధ్యులని భావిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తత తాలూకు దశలోకి చేరాయి. భారత్ ఇప్పటికే ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో, పాక్ లోని మిలిటరీ స్థావరాలపై గగనతల దాడులకు అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

కేంద్రం ప్రతీకారానికి రంగం సిద్ధం
ఉగ్రదాడులకు తక్షణ ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. కేంద్ర హోంశాఖ దేశ ప్రజలకు ప్రతికూల సమయాల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ నెల 7 న (బుధవారం) సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మాక్ డ్రిల్‌లో చేపట్టే ముఖ్యమైన అంశాలు:
శత్రు దేశాల నుంచి ఆకస్మిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లను మోగించడం, భారత వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను క్రియాశీలం చేయడం, కంట్రోల్ రూమ్‌లు మరియు షాడో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించడం వంటివి ఇందులో ఉన్నాయి. పౌరులు, విద్యార్థులకు ఆత్మరక్షణ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసే ‘క్రాష్ బ్లాక్‌అవుట్’ చర్యలు చేపట్టడం, కీలకమైన ప్లాంట్లు/సంస్థాపనలను శత్రువుల కంటపడకుండా మభ్యపెట్టడం (కామోఫ్లేజింగ్) వంటివి కూడా ఈ డ్రిల్స్‌లో భాగం. పౌర రక్షణ ప్రణాళికలు, తరలింపు ప్రణాళికలను ఆచరణలో పెట్టి పరీక్షించడం, బంకర్లు, కందకాలను శుభ్రపరచడం కూడా ఈ ప్రక్రియలో ఓ భాగమేనని అధికారులు తెలిపారు. ఈ డ్రిల్‌లు వాస్తవికంగా నిర్వహించబడి, ప్రజలు ఎలా స్పందించాలో ప్రాక్టికల్‌గా చూపిస్తారు. ఇది భయపెట్టే ఉద్దేశంతో కాకుండా, మైనిమమ్ నష్టం జరిగేలా ముందస్తుగా సిద్ధంగా ఉండేందుకు ప్రభుత్వ యత్నం.
Read also: PM Modi : రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోడీ భేటీ