తమిళనాడులో ఉన్న బిహార్ ప్రజలపై డీఎంకే ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో భాగంగా మోదీ మాట్లాడుతూ.. తమిళనాడులో పనిచేస్తున్న వలస కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తావించాడు. ఇందులో భాగంగానే బిహారీ కార్మికులను డీఎంకే అవమానిస్తోందనీ, వారి పట్ల వేధింపులకు పాల్పడుతోందనీ మోదీ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
Read Also : http://Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు ఖలీస్తానీ బెదిరింపులు.. నివాసం వద్ద భారీ భద్రత

”ఒక తమిళుడిగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని నాకు బాధగా ఉంది. ఇలాంటి ప్రకటనల ద్వారా తన బాధ్యతకు తగిన గౌరవాన్ని ఆయన కోల్పోకూడదు. బీజేపీ సభ్యులు ఎక్కడికి వెళ్లినా ఒడిశా – బిహార్ అని మాట్లాడుతూ, కేవలం ఎన్నికల రాజకీయాల కోసం తమిళులపై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడి ప్రజల తరపున నేను బీజేపీ సభ్యుల ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. వివిధ సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం గురించి గొప్పగా చెప్పుకునే భారతదేశంలో, హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, అలాగే తమిళులు బిహార్ ప్రజల మధ్య విరోధాన్ని సృష్టించే ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులను మానుకోవాలని నేను ప్రధానమంత్రిని, బీజేపీ సభ్యులను కోరుతున్నాను. దయచేసి దేశ సంక్షేమంపై దృష్టి సారించండి.” అంటూ స్టాలిన్ (MK Stalin) రాసుకోచ్చాడు.
భారతదేశంలో ఎం. కె. స్టాలిన్ ఎవరు?
ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ (జననం 1 మార్చి 1953) 2021 నుండి తమిళనాడు ఎనిమిదవ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 28 ఆగస్టు 2018 నుండి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మరియు జనవరి 2017 నుండి ఆగస్టు 2018 వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
ఎంకే స్టాలిన్ ఫుల్ ఫారం?
ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ (MK స్టాలిన్ అని పిలుస్తారు; తరచుగా అతని మొదటి అక్షరాలు MKS తో పిలుస్తారు) (జననం 1 మార్చి 1953) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి మరియు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడు.
Read hindi news : hindi.vaartha.com
E paper : epapervaartha.com
Read Also :