ఫ్రీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం తెలియని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయడం ప్రమాదకరమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ప్రజలను హెచ్చరించింది. పైరేటెడ్ కంటెంట్ అందిస్తున్న అనధికార యాప్స్ ద్వారా వినియోగదారుల పర్సనల్ డేటా, మొబైల్ భద్రత తీవ్ర రిస్క్‌లో పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి యాప్స్ మొదట ఉచిత వినోదాన్ని అందించినట్టు కనిపించినా, లోపల మాత్రం పెద్ద ముప్పు దాగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Read also: KCR: చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Pikashow సహా అనేక యాప్స్‌పై అనుమానం
లక్షల మంది వినియోగిస్తున్నట్లు చెప్పుకునే Pikashow App కూడా పూర్తిగా సురక్షితం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరహా యాప్స్‌లో దాగి ఉన్న మాల్వేర్, స్పైవేర్ మొబైల్‌లోకి చొరబడి, వినియోగదారుడికి తెలియకుండానే కీలక సమాచారాన్ని సేకరిస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు, సోషల్ మీడియా లాగిన్ డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.
లీగల్ ఇబ్బందులు కూడా తప్పవు
MHA:సైబర్ రిస్క్‌తో పాటు చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైరేటెడ్ కంటెంట్ చూడటం లేదా డౌన్‌లోడ్ చేయడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల జరిమానాలు, నోటీసులు, కొన్నిసార్లు న్యాయపరమైన చర్యలు కూడా ఎదురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సూచన ప్రకారం, సినిమాలు లేదా డిజిటల్ కంటెంట్‌ను అధికారిక ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు, లైసెన్స్ ఉన్న యాప్స్ ద్వారా మాత్రమే చూడాలని ప్రజలకు సూచించింది. ఫ్రీ అనే ఆకర్షణకు లోనై ఒకసారి డేటా పోతే, తిరిగి పొందడం చాలా కష్టం అవుతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పైరేటెడ్ యాప్స్ వాడటం ఎందుకు ప్రమాదకరం?
ఇవి మాల్వేర్, స్పైవేర్ ద్వారా వ్యక్తిగత డేటాను దోచుకునే ప్రమాదం ఉంది.
Pikashow App సురక్షితమేనా?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇది కూడా పూర్తిగా సురక్షితం కాదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: